వచ్చే వారం న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. 2019లో చెన్నైలో అనధికారిక సదస్సు తర్వాత జిన్‌పింగ్‌కు ఇదే తొలి భారత పర్యటన కావడం విశేషం.

  • సెప్టెంబర్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు
  • 2019 తర్వాత జిన్‌పింగ్‌కు ఇదే తొలి భారత పర్యటన
  • సుమారు 400 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందంతో రానున్న చైనా అధ్యక్షుడు
  • సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం భారత్-చైనా సంబంధాల్లో కీలక మలుపుగా అంచనా