విజయనగరం/రాభద్రపురం, సెప్టెంబర్ 30: రాభద్రపురం మండలంలో జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఈ పర్యటనలో భాగంగా ఆయన భూసాయవలస పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన, బీఎల్వోలు తిరస్కరించిన దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఆ దరఖాస్తులను తిరస్కరించడానికి గల సరైన కారణాలపై బీఎల్వోలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన్, ఏఈఆర్వోలు మరియు ఇతర రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.