విజయనగరం, సెప్టెంబర్ 12: వినాయక చవితి పర్వదినాన్ని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
- వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపు
- మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని సూచన
- ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగుల విగ్రహాల వినియోగం నివారించాలని విజ్ఞప్తి
- నిమజ్జనం సందర్భంగా పరిశుభ్రత, మార్గదర్శకాల పాటింపుపై ప్రజలకు, స్థానిక సంస్థలకు సూచన
వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలు, రసాయన రంగులతో కూడిన విగ్రహాల వినియోగాన్ని నివారించడం ద్వారా జలవనరులు, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు.
