ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే.. అధికారులతో అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 27వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. దొండపర్తి ఆర్చ్ వద్ద ప్రారంభమైన ఈ పర్యటన రామాలయం వీధి, చాకలి వీధి, కుమ్మరి వీధి, పులివారి వీధితో పాటు వార్డులోని పలు ప్రాంతాల్లో కొనసాగింది.

ప్రజల నుంచి నేరుగా సమస్యల సేకరణ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, నీటి పారుదల, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్ తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించారు.