విశాఖ జిల్లా ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎస్. మల్లేశ్వరరావు ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ అమరావతి జేఏసీ విశాఖ జిల్లా వైస్ చైర్మన్ ఈగల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా సంఘ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
నూతన కార్యవర్గంలో ఎన్. లోకేశ్వరరావు (రెవెన్యూ శాఖ) చైర్మన్‌గా, రావాడ సత్తిబాబు (వైద్య ఆరోగ్య శాఖ) కన్వీనర్‌గా, ఇమంది వరప్రసాద్ కోశాధికారిగా, ఉప్పిలి చిన్నారావు (పశుసంవర్ధక శాఖ), బండి వేలంగిని రావు (కేజీహెచ్) సభ్యులుగా నియమితులయ్యారు.
జిల్లా రెవెన్యూ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్యవర్గం
నూతన కార్యవర్గ సభ్యులు విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎం. విశ్వేశ్వర నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి నియామక పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, సంఘ కార్యకలాపాలపై చర్చించారు.
