రాష్ట్రంలోని నిరుద్యోగ వెటర్నరీ గ్రాడ్యుయేట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు వెటర్నరీ గ్రాడ్యుయేట్లు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజును కలిసి వినతిపత్రం సమర్పించారు.

జాబ్ క్యాలెండర్‌లో మంజూరైన 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-A పోస్టులను ఓపెన్ కాంపిటేటివ్ ఏపీపీఎస్సీ పరీక్ష ద్వారా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని వారు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 2,500 మందికి పైగా అర్హత కలిగిన వెటర్నరీ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే

అభ్యర్థుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వారి వినతిపత్రాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు.