విశాఖపట్నం, అక్టోబర్ 4 (ఎక్స్ప్రెస్ టుడే): టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా సేవలందిస్తున్న వృద్ధులను గౌరవిస్తూ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వృద్ధుల సేవలను గుర్తించి, వారిని సత్కరించడం ద్వారా సమాజంలో వారి పాత్రను గుర్తుచేశారు.
ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో మాజీ కార్పొరేటర్ రవి రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కవిత అధ్యక్షత వహించారు. కార్యక్రమం శివకుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో నిర్వహించగా, బి.వి. రామనాథ్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అనుబంధంగా ఉన్న వృద్ధులను ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు. వృద్ధుల అనుభవం, సేవా స్ఫూర్తి సమాజానికి స్ఫూర్తిదాయకమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
