విశాఖపట్నం, సెప్టెంబర్ 19: ఈరోజు సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, వంశీకృష్ణ శ్రీనివాసు గారు ఎంవీపీ రైతుబజార్ ను విజిట్ చేసారు. ఈ విజిట్ లో భాగంగా రైతుబజార్ లో ఏర్పాటు చేసిన సివిల్ సప్లై రాయితీ రైస్ కౌంటర్ ను తనిఖీ చేసారు. అప్పటికే రైస్ కౌంటర్ వద్ద ఉన్న వినియోగదారులతో మాట్లాడి రైస్ నాణ్యత గురించి అడిగి తెలుకున్నారు. మంచి క్వాలిటీ రైస్ తక్కువ ధరకు వినియోగదారులకు అందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమం లో అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలుకులు (RJDM) పి. సుధాకర్ గారు, DSO వి. భాస్కర్ రావు గారు ఉప సంయుక్త సంచాలుకులు శ్రీనివాసు కిరణ్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ EE గారు, DM సృజన గారు, జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతుబజార్ రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.