కాపులుప్పాడ ఐటీ పార్క్‌ ఫేజ్‌–Iలో ఎం/ఎస్‌ ఇన్‌ఫినిక్స్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.170 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఐటీ/ఐటీఈఎస్‌ క్యాంపస్‌ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్ కిశోర్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇన్‌ఫినిక్స్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుదీప్‌ టాండన్, సీఈవో శ్రీనివాస్‌ మండా, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సింహాచలంతో పాటు సంబంధిత అధికారులు, సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.