వారణాసిలోని బాబత్‌పూర్-పింద్రాలో నిర్వహించిన 'శ్రామిక మహిళా సత్కార' కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, వంట మనుషులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు.

స్వయం సహాయక సంఘాల ద్వారా రాష్ట్రంలో దాదాపు 28 లక్షల మంది మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. బీసీ సఖి, డ్రోన్ దీదీ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధి లభిస్తున్నాయని పేర్కొన్నారు.

మహిళల భద్రతకు భంగం కలిగించే వారికి కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళా శ్రామిక శక్తి 12 శాతం నుంచి 36 శాతానికి పెరిగినట్టు వెల్లడించారు.

నారీ శక్తి వందన్ అధినియం (సవరణ) బిల్లు అమల్లోకి వస్తే 2029 నాటికి లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం లభిస్తుందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.