లఖ్నవూ, సెప్టెంబర్ 2: ఔట్సోర్స్ ఉద్యోగుల మానవ వనరుల నిర్వహణను ఒకే డిజిటల్ వేదికపైకి తెచ్చే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ కార్పొరేషన్ (యూపీకాస్) పోర్టల్, వెబ్సైట్లను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రారంభించారు.
- రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది ఔట్సోర్స్ ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం
- పారదర్శక నియామక ప్రక్రియ, నేరుగా జీతాల చెల్లింపునకు హామీ
- ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుబాటులోకి
- కార్యక్రమంలో యూపీకాస్ లోగో ఆవిష్కరణ, ఉద్యోగులకు చెక్కుల పంపిణీ
గత ప్రభుత్వాలు ఔట్సోర్స్ ఉద్యోగులను భారంగా చూశాయని, తమ ప్రభుత్వం మాత్రం వారిని ఆస్తిగా భావిస్తుందని ఈ సందర్భంగా సీఎం యోగి వ్యాఖ్యానించారు. యూపీకాస్ ద్వారా నియామకాల్లో పారదర్శకత పెరిగి, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందుతాయని పేర్కొన్నారు.
ఈ కార్పొరేషన్ ఒక లాభాపేక్ష లేని రాష్ట్ర స్థాయి సంస్థగా పనిచేస్తుందని, ఔట్సోర్స్ ఉద్యోగుల హక్కులను పరిరక్షించేందుకు నియంత్రణ వ్యవస్థగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని విధివిధానాలు త్వరలో వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు.
