గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కౌమార బాలికల పోషకాహారం, ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో 9వ జాతీయ పోషణ మాసాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలో ప్రారంభించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
'మన అంగన్వాడీ – మన బాధ్యత' అనే నినాదంతో ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను చిన్నారుల సమగ్రాభివృద్ధికి పునాదిగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి, రాష్ట్ర మంత్రి బేబీ రాణి మౌర్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
పోషకాహార లోపాన్ని అరికట్టడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహనను మెరుగుపరచడమే ఈ మాసోత్సవాల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
