లఖ్‌నవూ, అక్టోబర్ 2: బలమైన పంచాయతీలు, సంపన్న గ్రామాలే గ్రామ స్వరాజ్యానికి పునాదని, పారదర్శకత, జవాబుదారీతనం, స్వావలంబనపై ఆధారపడిన వ్యవస్థలో వారసత్వ రాజకీయ నమూనాకు చోటు లేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గ్రామాలు అభివృద్ధిలో చివరి మెట్టుగా కాకుండా స్వయం సమృద్ధ ఉత్తరప్రదేశ్‌కు, నవ భారతానికి 'మొదటి యూనిట్'గా నిలిచేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పిన ఆయన, 2017కు ముందు గ్రామాలకు హామీలే తప్ప అభివృద్ధి దక్కలేదని పేర్కొన్నారు. (యూఎన్ఐ)