ఉత్తరప్రదేశ్ ఇక 'బీమారు' రాష్ట్రం కాదని, ఆరోగ్యం, రవాణా, విద్య, శాంతిభద్రతల్లో సాధించిన పురోగతితో రాష్ట్రానికి గౌరవప్రదమైన గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

దేవరియాలో రూ.305 కోట్ల విలువైన 80 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మెదడువాపు వ్యాధి నియంత్రణలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రస్తావిస్తూ, సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వం ఈ పథకంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. మాఫియా రాజ్యాన్ని పూర్తిగా అంతమొందించామని, మహిళలు, వ్యాపారులకు ముప్పు తలపెట్టేవారికి జైలు లేదా అంతకుమించిన శిక్ష తప్పదని హెచ్చరించారు.

2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్త పర్యటనలు ముమ్మరం చేశారు.