లక్నో, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో పని చేసే మహిళల భద్రతపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళల కోసం ప్రత్యేక 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రాత్రి వేళల్లో పని చేసే మహిళా ఉద్యోగుల కోసం రవాణా సదుపాయాలు మెరుగుపరచాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో పోలీసు గస్తీని పెంచాలని అధికారులకు సూచించారు.
మహిళా భద్రతపై ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన 'పనిచేసే మహిళల గౌరవ, భద్రత' కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
