ఒకే సమస్యతో బాధితులు మళ్లీ వస్తే, ఆ ఫిర్యాదు నిజమైనదైతే అధికారులపై జవాబుదారీతనం నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.

లఖ్‌నవూలో సోమవారం ఉదయం నిర్వహించిన ‘జనతా దర్శన్’ కార్యక్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలు విన్న ముఖ్యమంత్రి, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో, పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు.

బాధితులకు సంతృప్తి కలిగించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. భూమిని బలవంతంగా ఆక్రమించారన్న ఫిర్యాదులు నిజమని తేలితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.