శీతాకాలం ముంచుకొస్తున్న వేళ రష్యా వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం ఉక్రెయిన్‌కు భారీ సాయాన్ని ప్రకటించింది బ్రిటన్. పేట్రియాట్ వ్యవస్థలకు క్షిపణులు, ఇంటర్‌సెప్టర్లు, డ్రోన్లతో కూడిన ఈ ప్యాకేజీ నాటో మద్దతు కార్యక్రమంలో భాగం.

  • 10 కోట్ల పౌండ్ల (సుమారు రూ.1,060 కోట్లు) విలువైన గగనతల రక్షణ సాయం ప్రకటించిన బ్రిటన్ రక్షణ శాఖ
  • పేట్రియాట్ వ్యవస్థలకు క్షిపణులు, ఇంటర్‌సెప్టర్లు, డ్రోన్లు ఇందులో భాగం
  • నాటో మద్దతు కార్యక్రమంలో భాగంగా శీతాకాలానికి ముందు ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే యత్నం