గంటకు గరిష్టంగా 12 నిమిషాలే ప్రకటనలు ప్రసారం చేయాలన్న దశాబ్దాల నాటి నిబంధనను రద్దు చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

బుల్లితెరపై వాణిజ్య ప్రకటనల నిడివిపై దశాబ్దాలుగా అమల్లో ఉన్న పరిమితిని రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడం, మార్కెట్‌లో సమాన పోటీతత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సవరణ చేపట్టినట్టు కేంద్రం వెల్లడించింది.

గతంలో గంటకు గరిష్టంగా 12 నిమిషాల చొప్పున మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలన్న నిబంధన అమల్లో ఉండేది. దీనిని తొలగించడం వల్ల చానళ్లకు ఆదాయ అవకాశాలు మరింత విస్తృతం కానున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ నిర్ణయంతో ప్రసార రంగంలో పోటీ పెరిగి, వినియోగదారులకు మెరుగైన కంటెంట్ అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.