తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. రవిచంద్ర శనివారం లోక్‌భవన్‌లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో సమావేశమై తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు గవర్నర్‌ను ఆహ్వానించారు.
- గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను కలిసిన టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర
- తిరుమల సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేత
- గవర్నర్‌కు వేద ఆశీర్వచనం అందించిన టీటీడీ వేదపండితులు, అర్చకులు
ఈ సందర్భంగా టీటీడీ వేదపండితులు, అర్చకులు గవర్నర్‌కు వేద ఆశీర్వచనం అందించారు. తిరుమలలో వైభవంగా జరిగే సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఈవో రవిచంద్ర గవర్నర్‌ను కోరారు.
