ప్రభుత్వంలో కీలక పదవుల్లో 'బయటి వ్యక్తుల' అంశంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన బహిరంగ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

సొంత పార్టీ ప్రభుత్వంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని గౌడ్ హెచ్చరించారు.

అయితే తన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, పార్టీ శ్రేయస్సు కోసమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు.

ఈ పరిణామం రేవంత్ రెడ్డి సర్కార్‌కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.