తన విదేశీ పర్యటనలో భాగంగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. సీనియర్ ప్రొఫెసర్లతో చర్చలు జరిపిన సీఎం, డిసెంబర్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని కూడా కోరారు.

  • హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఆక్స్‌ఫర్డ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
  • డిసెంబర్ 2026లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆహ్వానం
  • ఆక్స్‌ఫర్డ్ సీనియర్ ప్రొఫెసర్లతో సీఎం చర్చలు

తెలంగాణను విద్యా, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ చర్చలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుపై ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ప్రతినిధులతో సానుకూల చర్చలు జరిగినట్లు సమాచారం.

డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026కు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.