నల్లగొండ, సెప్టెంబర్ 27: నల్లగొండ మీర్‌బాగ్ కాలనీలో కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు హత్యకు గురయ్యారు.

  • షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో హత్య
  • తమిళనాడుకు చెందిన కూలీల మధ్య ఘర్షణ
  • కూలి డబ్బుల అంశంలో వివాదమే కారణం

కూలి డబ్బుల విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.