కొడంగల్, నవంబర్ 8 (ఎక్స్‌ప్రెస్ టుడే): “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు” కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం కొడంగల్ మండలం పర్సాపూర్‌లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులైన బూరుపల్లి శ్రీనివాస్–సుమిత్ర దంపతుల ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించగా, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పేద ఆడబిడ్డల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

అనంతరం కోస్గిలో పర్యటించిన సీఎం, అక్కడ సైన్స్ మ్యూజియంను ప్రారంభించి, అందులోని సైన్స్ పరికరాలను పరిశీలించారు.