హైదరాబాద్, అక్టోబర్ 14 (ఎక్స్‌ప్రెస్ టుడే): యూకే–తెలంగాణ వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా యూకే మేయర్ల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రి డి. శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

తెలంగాణలో యూకే పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, యూకే–తెలంగాణ వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.

వైద్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్‌టైల్స్, నైపుణ్యాలు, పరిశోధన, తయారీ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిగాయి.

యూకే–ఇండియా బిజినెస్ కౌన్సిల్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.