హైదరాబాద్, నవంబర్ 5 (ఎక్స్ప్రెస్ టుడే): ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆహ్వానించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
