హైదరాబాద్, నవంబర్ 8 (ఎక్స్‌ప్రెస్ టుడే): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, కె. రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్‌తో పాటు సినీ నటుడు నాగార్జున కూడా శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీఎం కేక్ కట్ చేశారు.