విద్యుత్‌ వాహనాల (ఈవీల) ఛార్జింగ్‌, విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 111 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఈవీ ఛార్జింగ్‌కు వినియోగమైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో ఈవీ ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాయితీలు, పన్ను మినహాయింపులు కొనసాగుతున్నాయి.

రానున్న రోజుల్లో మరిన్ని ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి.