(ఎక్స్ప్రెస్ టుడే): గోవాలో జరుగుతున్న గోయ్ రాఖోన్న్ యాత్రలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవా బయలుదేరి వెళ్లారు.
ఈ సాయంత్రం ఆయన యాత్రలో పాల్గొననున్నారు. చీఫ్టెన్స్ స్మారకం నుంచి కున్కోలిమ్ బస్టాండ్ వరకు జరిగే పాదయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి గోవా నుంచి ఢిల్లీకి చేరుకోనున్నారు.
గోయ్ రాఖోన్న్ యాత్ర
గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత నెల 22న పనాజీలో గోయ్ రాఖోన్న్ యాత్ర ప్రారంభమైంది. 27 రోజుల పాటు 40 నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగుతున్న ఈ యాత్ర అక్టోబర్ 18న ముగియనుంది.
గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపును కాపాడుకోవడమే యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అధికార బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు గోవా కాంగ్రెస్ విభాగం ఈ యాత్ర నిర్వహిస్తోంది.
