న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది.
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరు
- కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ
- కృష్ణా, గోదావరి జలాల పంపకాలు, పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులపై చర్చ
పార్టీ సమావేశానికి హాజరవడంతో పాటు సీఎం కేంద్ర మంత్రిని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అపరిష్కృతంగా ఉన్న కృష్ణా, గోదావరి జలాల పంపకాలు, పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిసింది.