తమిళనాడులో వచ్చిన రాజకీయ మార్పు నిరాశగా మారిందని డీఎంకే అధినేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. చరిత్ర తెలియని యువత తీసుకున్న నిర్ణయం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విద్య, సామాజిక అభివృద్ధిలో సాధించిన ప్రగతి ద్రవిడ ఉద్యమ ఫలితమేనని పేర్కొన్న స్టాలిన్, గత ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు లక్షలాది మందికి ఇబ్బందిగా మారిందని అన్నారు.
టీవీకే నేతలు తమ నేతను భవిష్యత్ ప్రధానిగా ప్రొజెక్ట్ చేయడంపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీవీకే, డీఎంకే కూటమి నుంచి వైదొలగిన కాంగ్రెస్ మధ్య సంబంధాలపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
