చెన్నై సమీపంలోని పరండూరులో రెండో విమానాశ్రయం నిర్మాణ ప్రాజెక్టును విరమించుకుంటున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో ప్రకటించారు. నిరసనల నేపథ్యంలో టీవీకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గత డీఎంకే ప్రభుత్వ హయాంలో 2022లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును విరమించడం రాష్ట్ర అభివృద్ధికి తీరని లోటని డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్రంగా విమర్శించారు. ఇది రాష్ట్ర ప్రగతిని ఏళ్ల తరబడి వెనక్కి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పరండూరు ప్రాజెక్టుకు తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టిడ్కో) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. ప్రాజెక్టు విరమణపై టీవీకే ప్రభుత్వం మరిన్ని వివరణలు ఇవ్వాల్సి ఉందని విపక్షం డిమాండ్ చేస్తోంది.
