తిరుపతి, ఆగష్టు 27: 11 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.1.10 లక్షల జరిమానా. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. హెచ్చరించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ పర్యవేక్షణలో గురువారం (27-08-2026) తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత లక్ష్యంగా విస్తృతంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
11 మంది వాహనదారులపై కేసులు, రూ.1.10 లక్షల జరిమానా
ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 11 మంది వాహనదారులను గుర్తించి, వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. కేసుల్లో పట్టుబడిన 11 మందిని గౌరవ 1వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతి ఎదుట హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తి శ్రీమతి ధనలక్ష్మి ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున జరిమానా విధించారు. దీంతో మొత్తం రూ.1,10,000/- జరిమానా విధించబడింది.
మద్యం సేవించి వాహనం నడపొద్దు: జిల్లా ఎస్పీ హెచ్చరిక
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనం నడపాలని, మద్యం సేవించి వాహనం నడపకుండా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.
