తొండవాడ, సెప్టెంబర్ 29: చంద్రగిరి మండలం తొండవాడ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ అధ్యక్షతన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది.
తొండవాడకు చెందిన కె. హరికృష్ణ యాదవ్‌ను విద్యా కమిటీ చైర్మన్‌గా, కె. సుశీలను వైస్ చైర్మన్‌గా, మరో 10 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు.
నూతనంగా ఎన్నికైన చైర్మన్ కె. హరికృష్ణ యాదవ్, వైస్ చైర్మన్ కె. సుశీలను చంద్రగిరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు తపసి మురళి రెడ్డి దుశ్శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
