తిరుపతి, సెప్టెంబర్ 21: తిరుపతిలో ఈరోజు నిర్వహించిన ది కాండూర్ స్కూల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అండర్-15 కేటగిరీ పోటీల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వివిధ వయసుల క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఈ పోటీల్లో తిరుపతికి చెందిన ఏడు సంవత్సరాల బాలుడు అనిమిని విదుర్ అండర్-15 విభాగంలో పాల్గొని కేటగిరీ-2లో 12వ స్థానంలో నిలిచి మెరిట్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు గారు అనిమిని విదుర్ను అభినందించారు. చిన్న వయసులోనే చెస్ క్రీడపై ఆసక్తి పెంచుకుని, అండర్-15 వంటి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడం అభినందనీయమని అన్నారు. ఏడు సంవత్సరాల వయసులోనే పెద్దలతో పోటీ పడుతూ మెరుగైన ప్రదర్శన కనబరచడం విశేషమని పేర్కొన్నారు.
అలాగే విదుర్ ఇదే స్ఫూర్తితో చెస్‌పై మరింత ఆసక్తిని పెంపొందించుకుని, నిరంతరం సాధన చేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రవి నాయుడు ఆకాంక్షించారు. తన ప్రతిభతో తిరుపతి నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రవి నాయుడు గారు కోరుకున్నారు.
