తిరుమల, సెప్టెంబర్ 18: సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో శ్రీమలయప్పస్వామివారి అభయం భక్తులను అలరించింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన ఈ వైభవోపేత వాహనసేవతో మాడ వీధుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
అలంకరించిన సర్వభూపాల వాహనంపై ఊరేగిన మలయప్పస్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి హారతి ఇచ్చి పూజలు నిర్వహించారు.
