తిరుమల, సెప్టెంబర్ 27: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

  • అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
  • అక్టోబరు 16న గరుడ వాహనం, 17న పుష్పకవిమానం
  • అక్టోబరు 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం
  • నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు.

ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది.

వాహన సేవల వివరాలు

అక్టోబరు 11 – అంకురార్పణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు.

అక్టోబరు 12 – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు; పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు.

అక్టోబరు 13 – చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు; హంస వాహనం – రాత్రి 7 గంటలకు.

అక్టోబరు 14 – సింహ వాహనం – ఉదయం 8 గంటలకు; ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు.

అక్టోబరు 15 – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు; సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు.

అక్టోబరు 16 – మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు; గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు.

అక్టోబరు 17 – హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు; పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు; గజ వాహనం – రాత్రి 7 గంటలకు.

అక్టోబరు 18 – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు; చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు.

అక్టోబరు 19 – స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు; అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు.

అక్టోబరు 20 – చక్రస్నానం – ఉదయం 6 గంటలకు.