తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవేంకటేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

  • బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం స్వామివారి సన్నిధికి చేరుకున్న సీఎం కుటుంబం
  • మంగళవాయిద్యాల నడుమ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకున్న ముఖ్యమంత్రి
  • సీఎం కుటుంబ సభ్యులకు వేద మంత్రాలతో ఆలయ పండితుల ఆశీర్వచనం
  • సీఎంకు, కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాల అందజేత
  • మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, బోర్డు మెంబర్ల పాల్గొనడం

బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం మంగళవాయిద్యాల నడుమ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ముఖ్యమంత్రి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు వేద మంత్రాలతో ఆలయ పండితులు ఆశీర్వచనాలు పలికారు. సీఎంకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, టీటీడీ ఛైర్మన్ బీఆర్.నాయుడు, బోర్డు మెంబర్లు పాల్గొన్నారు.