తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తిరుమలకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు తిరుమలలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

  • ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  • సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకోనున్న సీఎం
  • రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు శ్రీ గాయత్రీ నిలయానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి
  • రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు
  • రాత్రి 7.55 నుంచి 9.15 గంటల వరకు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి, సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు శ్రీ గాయత్రీ నిలయానికి చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు.

అనంతరం రాత్రి 7.55 గంటల నుంచి 9.15 గంటల వరకు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం గాయత్రీ నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు.