చెన్నై, అక్టోబర్ 2: తమిళనాడు రాష్ట్ర రహదారుల శాఖ ఏర్పాటు చేసిన దిశా సూచిక బోర్డులపై హిందీ పేర్లు ఉండటం ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని వివాదంలోకి నెట్టింది. ఇది హిందీ రుద్దడమేనంటూ డీఎంకే, పీఎంకే సహా ప్రతిపక్షాలు విమర్శించాయి.
వివాదం బయటపడగానే ప్రభుత్వం శుక్రవారం బోర్డులపై హిందీ పేర్లను తొలగించి, రహదారుల శాఖకు చెందిన ఇద్దరు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. త్రిభాషా విధానాన్ని టీవీకే ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించదని పీడబ్ల్యూడీ మంత్రి ఆధవ్ అర్జున స్పష్టం చేశారు. (యూఎన్ఐ)