1931 డిసెంబర్ 14న కమిల్లా జిల్లా కోర్టులో కేవలం 14 ఏళ్ల వయసులో మేజిస్ట్రేట్‌పై కాల్పులు జరిపిన సునీతి చౌదరి ధైర్యసాహసాలు నేటికీ స్ఫూర్తిదాయకం.
1917లో నేటి బంగ్లాదేశ్‌లోని కమిల్లాలో జన్మించిన సునీతి చౌదరి, తండ్రి, అన్నయ్య స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం చూస్తూ చిన్న వయసులోనే దేశభక్తి భావాలు పెంచుకున్నారు. పసివయసులోనే 'యుగాంతర్' అనే విప్లవ సంస్థలో చేరి, ఆయుధాలు వాడటంలో శిక్షణ పొందారు.
1931 సెప్టెంబర్‌లో కమిల్లా జిల్లా మేజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ తమ పాఠశాలకు వచ్చినప్పుడు, తోటి విద్యార్థిని శాంతి ఘోష్‌తో కలిసి సునీతి పథకం రచించారు. అదే ఏడాది డిసెంబర్ 14న పుస్తకాల మధ్య దాచిన రివాల్వర్లతో మేజిస్ట్రేట్‌పై ఐదు తూటాలు కాల్చి, 'వందేమాతరం' అని నినదించి పోలీసులకు పట్టుబడ్డారు.
కోర్టులో న్యాయమూర్తి ఎందుకు చేశారని ప్రశ్నించగా, 'మా దేశం కోసం చేశాం' అని నిర్భయంగా బదులిచ్చారు. వయసు రీత్యా మరణశిక్ష విధించలేక జీవితఖైదు విధించారు. 1939లో నేతాజీ, గాంధీజీల జోక్యంతో విడుదలైన సునీతి, ఆ తర్వాత విప్లవకారుడు ప్రద్యోత్ కుమార్ గుహను వివాహమాడారు. 1988లో కలకత్తాలో కన్నుమూశారు.
