శ్రీకాకుళం, సెప్టెంబర్ 19: నిర్భయ్ ఫండ్ తో జిల్లాలో మహిళలకు రక్షణ, భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో జిల్లాను ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రతా సౌకర్యాలు ఏర్పాటుకు ఒక్క శ్రీకాకుళం జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శనివారం జిల్లా కలెక్టర్ తో కేంద్ర ప్రభుత్వ అధికారులు వర్చ్యువల్ గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల పై కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించారు. మహిళలకు పింక్ టాయిలెట్ లు, సిసిటీవిలు, క్రిటికల్ కేర్ యూనిట్లు, చార్జింగ్ స్టేషన్లు, చీకటి ప్రదేశంలో హై మాస్క్ లైట్లు, పోలీస్ శాఖ పానిక్ బటన్ సౌకర్యం, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ, తదితర మైదానం కల్పించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అందించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ అద్భుతంగా తయారు చేసినందుకు కలెక్టర్ ను అభినందించారు.

జిల్లాలో వైద్య ఆరోగ్యం, రవాణా, పోలీసు శాఖ, మెప్మా, తదితర శాఖలతో జిల్లాలో మహిళలకు కావలసిన సౌకర్యాల పై కలెక్టర్ చర్చించారు. చార్జింగ్ స్టేషన్ లకు ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.