పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 492.70 పాయింట్లు (0.63%) క్షీణించి 77,235.46 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 132.75 పాయింట్లు (0.55%) పడిపోయి 24,154.90 వద్ద ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియడం, హర్మూజ్ జలసంధిపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.
ఐటీ రంగ షేర్లు అత్యధికంగా నష్టపోగా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో వంటి షేర్లు క్షీణించాయి. క్రూడాయిల్, విద్యుత్ రంగ షేర్లు మాత్రం స్వల్ప లాభాలతో నిలిచాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) సోమవారం రూ.2,535 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ) రూ.5,101 కోట్ల కొనుగోళ్లు కొంతమేర ఆసరాగా నిలిచాయి.
