సత్యవేడు, సెప్టెంబర్ 25: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గానికి చెందిన నాయకులతో తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డా. పనబాక లక్ష్మి ఆధ్వర్యంలో, సత్యవేడు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు.

  • నియోజకవర్గంలోని గ్రామస్థాయి నుంచి నాయకులు, కార్యకర్తల వరకు సమన్వయంతో పనిచేయాలని సూచన
  • స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశం
  • ఎన్నికల ప్రక్రియకు నాయకులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచన
  • సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన నాయకులతో కార్యాచరణ, సమన్వయంపై విస్తృత చర్చ

ఈ సందర్భంగా డా. పనబాక లక్ష్మి మాట్లాడుతూ.. రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని గ్రామస్థాయి నుంచి నాయకులు, కార్యకర్తల వరకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ఎన్నికల ప్రక్రియకు నాయకులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని తెలిపారు.

అలాగే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.

సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన నాయకులతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ, సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.