రూ.40 కోట్ల సుపారీపై ‘గొడ్డలి పార్టీ’ అధినేత సమాధానం చెప్పాలి: సీఎం చంద్రబాబు
ప్రొద్దుటూరు, అక్టోబర్ 5 (ఎక్స్ప్రెస్ టుడే): వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయని, అంతిమ లబ్ధిదారులెవరో తెలిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రూ.40 కోట్ల సుపారీపై ‘గొడ్డలి పార్టీ’ అధినేత సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
హత్య నిందను తనపై మోపి, సొంత పత్రిక ‘సాక్షి’లో ‘నారాసుర రక్తచరిత్ర’ అని రాశారని చంద్రబాబు పేర్కొన్నారు. నిజం నిప్పులాంటిదని, నిప్పుతో చెలగాటం ఆడితే ఎప్పటికైనా భగ్నమవుతుందని వ్యాఖ్యానించారు.
మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోచిన అంతిమ లబ్ధిదారు కూడా ‘గొడ్డలి పార్టీ’ అధినేత వైపే చూపిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు.
