ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నిష్ణాతులను తయారు చేసేందుకు వచ్చే ఏడాదిలోగా కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ నేర్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని యువత ఆ సాంకేతికతలో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాని తెలిపారు.

పరిశ్రమలు తమ ఐటీ బృందాలను నవీకరించుకుంటూ, అవసరమైన నైపుణ్యాలను శిక్షణ ద్వారా అందించనున్నట్టు వెల్లడించారు. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడటంతో పాటు, ఉన్నత విద్యను కూడా ప్రోత్సహించనున్నట్టు ప్రకటించారు.