ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించడంతో, పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలకు సాగే చార్‌ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

  • భారీ వర్షాల హెచ్చరికతో చార్‌ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
  • పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారుల ఆదేశం
  • వాతావరణం మెరుగుపడిన తర్వాతే యాత్ర పునఃప్రారంభమని ప్రకటన

కొండచరియలు విరిగిపడే ప్రమాదం, జల్లుల తీవ్రత దృష్ట్యా పుణ్యక్షేత్రాల మార్గంలో ఇప్పటికే ప్రయాణిస్తున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, కొత్తగా యాత్ర ప్రారంభించొద్దని జిల్లా యంత్రాంగాలు సూచించాయి.

వాతావరణం మెరుగుపడి, దెబ్బతిన్న రహదారులు పునరుద్ధరించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అనధికార సమాచారాన్ని నమ్మవద్దని, జిల్లా యంత్రాంగం జారీ చేసే అధికారిక సూచనలనే అనుసరించాలని యాత్రికులకు విజ్ఞప్తి చేశారు.