న్యూఢిల్లీ, అక్టోబర్ 9 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ సైబర్ నేరాలు, సైబర్ మోసాల నివారణకు ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
సైబర్ మోసాలను అడ్డుకునేందుకు, డీప్‌ఫేక్‌లను నియంత్రించేందుకు ప్రపంచ స్థాయి ఫ్రేమ్‌వర్క్ అవసరమని ఆయన అన్నారు. టెలికాం రంగం స్వయం సమృద్ధి దిశగా స్థిరంగా సాగుతుండటం ప్రోత్సాహకరమని ప్రధాని పేర్కొన్నారు.
ఇదే వేదికపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, 6జీ రంగంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని చెప్పినట్టు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.