న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పహల్గాం ఉగ్రఘటన అనంతరం భారత విమానయాన సంస్థలకు పాకిస్థాన్ గగనతలంపై నిషేధం కొనసాగుతోంది. దీంతో భారత విమానాలు ఇతర మార్గాల్లో వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం చైనాతో భారత్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షిన్జియాంగ్లోని హోటన్ మార్గంలో వెళ్లేందుకు వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే, ఏడాదిగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా ఒప్పందం కుదరలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
గతేడాది ఏప్రిల్లో పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్లు గగనతల వినియోగంపై పరస్పరం ఆంక్షలు విధించుకున్నాయి. సైనిక విమానాలు సహా భారత్కు చెందిన విమానయాన సంస్థలు నడిపించే సర్వీసులపై పాక్ నిషేధం విధించింది. అప్పటినుంచి ప్రతి నెలా వాటిని పొడిగిస్తూ వస్తోంది. దీంతో ఐరోపా, ఉత్తర అమెరికా వైపు వెళ్లే విమానాలు ఇతర మార్గాల్లో వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం, నిర్వహణ ఖర్చు పెరగడం వల్ల విమానయాన సంస్థలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది.