న్యూఢిల్లీ, నవంబర్ 4 (ఎక్స్‌ప్రెస్ టుడే): దేశ డేటా సేకరణ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.4,371 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో దేశ గణాంక వ్యవస్థను మార్చడం, ముఖ్యంగా సూక్ష్మస్థాయి (మైక్రో లెవల్) డేటాపై దృష్టి పెట్టడమే లక్ష్యంగా కేబినెట్ ‘విస్తార్’ (VISTAR) పథకానికి ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. మెరుగైన డేటా ఉంటే మెరుగైన నిర్ణయాలు, మెరుగైన విధానాలు సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు.