న్యూఢిల్లీ (ఎక్స్‌ప్రెస్ టుడే): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. కేరళ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన ఈ నియామకాలను రాష్ట్రపతి భవన్ సోమవారం (అక్టోబర్ 12) విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్‌ను కేరళ గవర్నర్‌గా బదిలీ చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. ఆర్లేకర్ ఇప్పటివరకు తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో ఉన్నారు.

ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్‌ను నియమించగా, ఆయన హరిబాబు కంభంపాటి స్థానంలో బాధ్యతలు చేపడతారు. కర్ణాటక గవర్నర్‌గా డా. సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డా. ఢాల్ సింగ్ బిసెన్, సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు.

ఈ నియామకాలు సంబంధిత నియామకులు తమ పదవుల్లో బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు.